చచ్చిపో.. చచ్చిపో అంటూ పీడకల రావడంతో.. | woman suicide attempt after bad dream forced | Sakshi
Sakshi News home page

చచ్చిపో.. చచ్చిపో అంటూ పీడకల రావడంతో..

Mar 29 2016 2:44 PM | Updated on Sep 3 2017 8:49 PM

కలల ప్రభావంతో ఓ మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.

హైదరాబాద్: కలల ప్రభావంతో ఓ మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. తుకారంగేట్ పోలీసుస్టేషన్ డీఎస్‌ఐ మోహన్ కథనం ప్రకారం... అడ్డగుట్ట బి-సెక్షన్‌లో స్వప్న(26),రాజు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. స్వప్నకు కొంతకాలంగా నిద్రలో ‘చచ్చిపో.. చచ్చిపో’ అంటూ భయంకరమైన కలలు వస్తున్నాయి.

ఈనెల 27 భర్త వరంగల్‌కు వెళ్లగా.. పిల్లలు మధ్యాహ్నం బయటకు వెళ్లారు. ఆ సమయంలో నిద్రపోతున్న స్వప్నకు మళ్లీ అటువంటి కలే రావడంతో.. ఒక్కసారిగా మంచంపైనుంచి లేచి వంట గదిలోకి వెళ్లి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికులు మంటలను ఆర్పి బాధితురాలిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ప్రస్తుతం చికిత్సపొందుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement