మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ రాజ్యలక్ష్మి నగర్‌లో భారీ చోరీ జరిగింది.
మీర్‌పేట్ (హైదరాబాద్) : మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ రాజ్యలక్ష్మి నగర్‌లో భారీ చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటున్న దామోదర్ రెడ్డి ఇంట్లో దొంగలు పడి సుమారు రూ.30 లక్షల నగదు, పెద్ద మొత్తంలో బంగారం దోచుకెళ్లారు. చోరీ జరిగిన సమయంలో దామోదర్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి పొరుగూరు వెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు.