విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఉపాధ్యాయుడు చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు
చిన్నారితో అసభ్య ప్రవర్తన
పోలీసుల అదుపులో నిందితుడు
విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఉపాధ్యాయుడు చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మాదన్నపేట డీ ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం... సంతోష్‌నగర్ డివిజన్ నెహ్రూనగర్‌కు చెందిన చిన్నారి (7) స్థానిక పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. సైదాబాద్‌లోని ఓ మద ర్సాలో అరబిక్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఇర్ఫాన్ అహ్మద్ సిద్ధిఖీ (37) దరబ్‌జంగ్ కాలనీలోని తన ఇంట్లో అరబిక్ తరగతులు నిర్వహిస్తున్నాడు. అరబిక్ నేర్చుకునేందుకు చిన్నారిని తల్లిదండ్రులు ఇతని వద్దకు పంపుతున్నారు.
ఇదిలా ఉండగా.. నాలుగు రోజులుగా చిన్నారి ముభావంగా ఉండటంతో గమనించిన పాఠశాల ఉపాధ్యాయురాలు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారు శుక్రవారం కుమార్తెను ఏమైందని అడుగగా ఉపాధ్యాయుడు ఇర్ఫాన్ నాలుగు రోజుల కిందట తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.