జీహెచ్ఎంసీకి స్పెషలాఫీసర్ను నియమించాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
జంటనగరాల పాలన బాధ్యతలను చూసుకుంటున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి గడువు బుధవారంతో ముగిసిపోనుంది. అయితే ఎన్నికలు మాత్రం ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేకపోవడంతో స్పెషలాఫీసర్ను నియమించాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్కుమార్ సోమవారం భేటీ అయ్యారు. అప్పుడే పాలకమండలి గడువు, ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.