'అక్బర్‌.. గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతోనే చనిపోయాడు' | Driver akbar dies due to gun miss fire only, says DCP kamala hassan | Sakshi
Sakshi News home page

'అక్బర్‌.. గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతోనే చనిపోయాడు'

Feb 16 2016 5:52 PM | Updated on Sep 29 2018 5:26 PM

గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతోనే డ్రైవర్ అక్బర్‌ చనిపోయాడని డీసీపీ కమలాసన్‌ రెడ్డి వెల్లడించారు. గన్‌మెన్‌ రవీందర్‌ చేతిలోంచి గన్‌ను అక్బర్‌ అడిగితీసుకున్నాడని చెప్పారు.

హైదరాబాద్‌: గన్‌ మిస్‌ఫైర్‌ కావడంతోనే డ్రైవర్ అక్బర్‌ చనిపోయాడని డీసీపీ కమలాసన్‌ రెడ్డి వెల్లడించారు. గన్‌మెన్‌ రవీందర్‌ చేతిలోంచి గన్‌ను అక్బర్‌ అడిగితీసుకున్నాడని చెప్పారు. మంగళవారం డీసీపీ మీడియాతో మాట్లాడుతూ..  డ్రైవర్‌ అక్బర్‌ గన్‌ చూస్తున్న సమయంలో గన్‌ ఒక్కసారిగా మిస్‌ఫైర్‌ అవడంతో అతడి చాతిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లిందని పేర్కొన్నారు. దాంతో అక్బర్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. సర్వీస్‌ రివాల్వర్‌ ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదని హెచ్చరించారు.

ఈ విషయంలో చట్టరీత్యా గన్‌మెన్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వ్యక్తి ప్రాణాలు పరోక్షంగా తీసిన గన్‌మెన్‌ రవీందర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీసీపీ కమలాసన్‌ రెడ్డి వెల్లడించారు. కాగా, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంగళవారం మధ్యాహ్నం మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ అక్బర్‌ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement