ముస్లిం రిజర్వేషన్లను పెంచే విషయంపై అసెంబ్లీలో బిల్లును పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా
ముస్లిం రిజర్వేషన్ బిల్లుకు నిరసనగా నేడు ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లను పెంచే విషయంపై అసెంబ్లీలో బిల్లును పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల దిగ్బంధానికి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ రిజర్వేషన్ల విషయంలో సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి ధ్వజమెత్తారు. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొడుతున్నారని ఆరోపించారు.
మతపరమైన రిజర్వేషన్ల బిల్లును ప్రభుత్వం అప్రజా స్వామికంగా ప్రవేశపెట్టిందని విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్‌కు.. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.