పాతబస్తీ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? | BJP Asaduddin Challenge to Owaisi | Sakshi
Sakshi News home page

పాతబస్తీ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

May 3 2017 1:57 AM | Updated on Mar 29 2019 9:31 PM

పాతబస్తీ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? - Sakshi

పాతబస్తీ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

పాతబస్తీ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి బీజేపీ సవాల్‌ విసిరింది.

ఎంపీ అసదుద్దీన్‌కు బీజేపీ సవాల్‌
సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి బీజేపీ సవాల్‌ విసిరింది. 1989నుంచి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఐఎం పేద ముస్లింల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు డిమాండ్‌ చేశారు.

మంగళవారం పార్టీ అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాశ్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సుదీర్ఘకాలం నుంచి ఇక్కడ ప్రజా ప్రతినిధులుగా ఉన్న ఒవైసీ కుటుంబం అభివృద్ధి చెందిందే తప్ప పాతబస్తీ బాగుపడలేదన్నారు. ఎంపీగా అసదుద్దీన్‌కు ఇదే చివరి అవకాశమని, 2019 ఎన్నికల్లో మైనారిటీల మద్దతుతో బీజేపీ ఇక్కడి ఎంపీ సీటును గెలుచుకుంటుందన్నారు. దిగ్విజయ్‌కి వయసుతో పాటు చాదస్తం పెరిగిందని, ఆయన చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement