ఇదో ‘ప్రేమ్’కథ | Sakshi
Sakshi News home page

ఇదో ‘ప్రేమ్’కథ

Published Sun, Sep 14 2014 11:21 PM

ఇదో ‘ప్రేమ్’కథ

ప్రేమ ఓ మధుర జ్ఞాపకం... అది ఎప్పుడు... ఎక్కడ... ఎలా.. మొదలవుతుందో ఎవరికీ తెలియదు. ఆ ప్రేమ పుట్టుక తొలిచూపునకే అవ్వొచ్చు.. తొలి పలుకుకే అవ్వొచ్చు.. తొలి స్పర్శకే అవ్వొచ్చు.. అలాంటి ఈ ప్రేమ దేశంలో ఒకమ్మాయిని ఫస్ట్ టైం చూసి ప్రేమ్ అనే కుర్రాడు పడిన తపన.. తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు అనే అంశంతో లఘు చిత్ర దర్శకుడు చేతన్ సిరసపల్లి నిర్మించిన ప్రేమ్‌కథ లఘు చిత్రం నెటిజన్ల మనసు దోచుకుంటోంది.
 
బీటెక్ విద్యార్థి చేతన్ దర్శకత్వం మీద ఉన్న మక్కువతో ప్రణీత్, కృష్ణకుమారిలను హీరో, హీరోయిన్‌లుగా తీసుకొని అద్భుతమైన స్క్రీన్‌ప్లే, మాటలతో ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించాడు. వైజాగ్‌లోని సుందరమైన లోకేషన్లలో చిత్రీకరించాడు. దీని తరువాత చేతన్‌కు రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ నుంచి పిలుపు వచ్చింది. అతడి నూతన చిత్రంలో దర్శకత్వ విభాగంలోనూ చోటు సంపాదించాడు. జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రేమకథా చిత్రాలను తీస్తానని చేతన్ చెబుతున్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement