దేశంలో యువశక్తి అపారం | youth festival | Sakshi
Sakshi News home page

దేశంలో యువశక్తి అపారం

Feb 1 2017 12:09 AM | Updated on Sep 18 2019 3:24 PM

దేశంలో యువశక్తి అపారం - Sakshi

దేశంలో యువశక్తి అపారం

ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి దేశంలోనే ఉందని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఎ¯ŒSఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన యువజనోత్సవాలు మంగళవారం ముగిశాయి. ముగింపు సమావేశంలో ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ విపత్తు సమయాలలో ఎ¯ŒSఎస్‌ఎస్‌ వలంటీర్లు ‘మానవసేవయే

  • రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్‌ 
  • కార్యదర్శి ఆదిత్యనా«థ్‌ దాస్‌ 
  • నన్నయలో ముగిసిన యూత్‌ ఫెస్టివల్‌
  • రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) :
    ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి దేశంలోనే ఉందని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఎ¯ŒSఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన యువజనోత్సవాలు మంగళవారం ముగిశాయి. ముగింపు సమావేశంలో ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ విపత్తు సమయాలలో ఎ¯ŒSఎస్‌ఎస్‌ వలంటీర్లు ‘మానవసేవయే పరమావధి’గా సేవలందిస్తారన్నారు. అటువంటి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కొత్త ఉత్తేజాన్ని, శక్తిని పొందాలనే స్వార్థం కూడా ఉందన్నారు. 
    వైద్యుని తరువాత స్థానం గురువుదే...
    తల్లిదండ్రులకు, భగవంతునికి మధ్య వారధిగా గురువే నిలుస్తాడని ప్రముఖ సినీనటి, డబ్బింగ్‌ ఆర్టిస్టు రోజారమణి అన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణను అలవర్చి సమాజానికి మంచి పౌరులను అందించేందుకు తాపత్రయపడతాడన్నారు. సంఘ సేవ చేసే వారంటే  అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చానని యువ హీరో తరుణ్‌ అన్నారు. చేసే పనిపై శ్రద్ధ ఉండాలని, మనసు పెట్టి చేస్తే ఏపనికైనా విజయం లభిస్తుందన్నారు. తల్లిదండ్రులను గౌరవించడంలో తరుణ్‌ ఆదర్శనీయుడని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నన్నయ వీసీ ఆచార్య ఎం. ముత్యాలునాయుడు అన్నారు. ఈయనను తరుణ్‌ వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.  
    విజేతలకు బహుమతి ప్రదానం 
    యువజనోత్సవాలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 19 యూనివర్సిటీల నుంచి వచ్చిన సుమారు 500 మంది విద్యార్థుల హాజరైనట్టు ఎ¯ŒSఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎ¯ŒS.కిరణ్‌చంద్ర తెలిపారు. వీరికి రంగోళి, మోనో యాక్షన్, డ్రమ్స్, తబళా, మిమిక్రీ, క్విజ్, జానపద, సాంప్రదాయ నృత్యాలు, సినీ డాన్సులు, గ్రూప్‌ డా¯Œ్స, చిత్రలేఖనం, పాటలు, డిబేట్‌ తదితర 14 విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నన్నయ వర్సిటీ విద్యార్థులు ఓవరాల్‌ ఛాంపియ¯ŒS షిప్‌ని కైవసం చేసుకున్నారు. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆదిత్యనాథ్‌ను ఘనంగా సత్కరించారు. వర్సిటీ రిజిస్టార్‌ ఆచార్య ఎ. నరసింహారావు, రాష్ట్ర ఎ¯ŒSఎస్‌ఎస్‌ అధికారి పి. రామచంద్రరావు, ఏయూ అధికారి ఎ¯ŒSడీ పాల్, ప్రిన్సిపాల్స్‌ ఆచార్య కేఎస్‌ రమేష్, ఆచార్య పి. సురేష్‌వర్మ, డాక్టర్‌ పి.సుబ్బారావు, డాక్టర్‌ ఎ.మట్టారెడ్డి, డీ¯Œ్స ఆచార్య ఎస్‌.టేకి, డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, డాక్టర్‌ పి.వెంకటేశ్వర్రావు, సహాయ అధ్యాపకులు డాక్టర్‌ కేవీఎ¯ŒSడీ ప్రసాద్, డాక్టర్‌ ఆర్‌వీఎస్‌ దొర, డాక్టర్‌ ఎలీషాబాబు తదితరులు 
    పాల్గొన్నారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement