అనంతపురం రూరల్ మండలం ఆలుమూరు రోడ్డులో మంగళవారం జరిగిన విద్యుదాఘాతానికి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్వేలికి చెందిన జేసీబీ డ్రైవర్ సురేశ్(21)‡మృతి చెందినట్లు సీఐ కృష్ణమోహన్ తెలిపారు.
విద్యుదాఘాతానికి డ్రైవర్ బలి
Oct 19 2016 12:15 AM | Updated on Sep 28 2018 3:41 PM
మృతుడు కర్నూలు జిల్లా వాసి
అనంతపురం సెంట్రల్ : అనంతపురం రూరల్ మండలం ఆలుమూరు రోడ్డులో మంగళవారం జరిగిన విద్యుదాఘాతానికి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్వేలికి చెందిన జేసీబీ డ్రైవర్ సురేశ్(21)‡మృతి చెందినట్లు సీఐ కృష్ణమోహన్ తెలిపారు. జేసీబీలో ఆలమూరు వైపు వెళ్తుండగా రోడ్డుకడ్డంగా కిందకుlవేలాడుతున్న తీగలు జేసీబీకి తాగడంతో విద్యుత్ ప్రవహించింది. ఈ కారణంగా అతను షాక్ గురై అక్కడికక్కడే మరణించినట్లు వివరించారు. అదే జేసీబీలో ఉన్న మరో వ్యక్తి అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
Advertisement


