పాముకాటుతో చిన్నారి మృతి చెందిన ఘటన కామవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి లక్ష్మి, బసవరాజు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
పాముకాటుతో చిన్నారి మృతి
Nov 11 2016 3:07 AM | Updated on Aug 20 2018 7:28 PM
కౌతాళం: పాముకాటుతో చిన్నారి మృతి చెందిన ఘటన కామవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి లక్ష్మి, బసవరాజు దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో చివరి సంతానం మల్లేష్ అలియాస్ మల్లికార్జున(4) బుధవారం రాత్రి ఆరుబయట ఆడుకుంటుండగా ఏదో కరిచిందని ఏడవటంతో ఇంట్లో నుంచి తల్లి లక్ష్మి బయటకు వచ్చి చూసింది. విషయం తెలుసుకుని చుట్టుపక్కల చూడగా పామును చేసి కేకలు వేసింది. తండ్రి బసవరాజు వచ్చి పామును చంపేందుకు ప్రయత్నించగా తప్పించుకుంది. అస్వస్థతకు గురైన మల్లేష్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గురువారం బాలుడికి గ్రామంలో అంత్యక్రియలను నిర్వహించారు. బుధవారం రాత్రి అదే గ్రామంలో బోయ పక్కిరయ్య భార్య పద్మావతికి, హరిజన జాన్ పెద్దకుమారుడు పెద్దరంగడుకు కూడా పాముకాటు వేయగా వారు చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
Advertisement
Advertisement