మండలంలోని మంగనపల్లి గ్రామానికి చెందిన కంపెల మల్లేశ్ విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... మల్లేశ్ పొద్దంతా వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. తన గేదె ఇంటి పక్కనున్న పొలంలో మేత మేస్తోంది.
కొడుక్కు కరెంట్ షాక్... కాపాడిన తండ్రి
Aug 1 2016 11:46 PM | Updated on Sep 22 2018 7:53 PM
వేమనపల్లి : మండలంలోని మంగనపల్లి గ్రామానికి చెందిన కంపెల మల్లేశ్ విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... మల్లేశ్ పొద్దంతా వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. తన గేదె ఇంటి పక్కనున్న పొలంలో మేత మేస్తోంది. సాయంత్రం కావటంతో గేదెను కట్టేసేందుకు దాని వద్దకు వెళ్లాడు. పొలంలోని విద్యుత్ స్థంభానికి ఉన్న సపోర్ట్ వైర్‌కు విద్యుత్ ప్రసారం అయ్యే విషయాన్ని గమనించలేదు. దాని కింద నుంచి వెళ్లగా సపోర్ట్‌వైర్ అతడి ఎడమ చేతికి తలిగి షాక్‌కు గురయ్యాడు. గమనించిన అతడి తండ్రి, వికలాంగుడైన వద్ధుడు ముత్తయ్య(78) తన ప్రాణాలు పోయినా సరేననుకుని తెగించి కొడుకును కాపాడాడు. ఫెన్సింగ్ పైనుంచి దూకి కర్ర సహాయంతో విద్యుత్ తీగెలను కొట్టాడు. అంతలోనే విద్యుత్ తీగెలు విడిపోయాయి. కాలు పట్టి అవతలికి లాగి కొడుకును కాపాడాడు. అపస్మారక స్థితిలో ఉన్న మల్లేశ్‌ను సోదరుడు వెంకటేశ్, కుటుంబసభ్యులు నీల్వాయి వాగు వద్దకు తరలించారు. వాగులో వరద నీరు ఎక్కువగా ఉన్నా ఎలాగోలా వాగు దాటి 108 అంబులెన్స్ సహాయంతో మంచిర్యాలకు తరలించారు. బాధితుడు ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో అత్యవసర వైద్యం అందిస్తున్నారు.
Advertisement
Advertisement