ప్రైవేట్ కళాశాలల చేతుల్లో ప్రభుత్వాసుపత్రులు | posts filled in medical department, says AP Health minister kamineni srinivas | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ కళాశాలల చేతుల్లో ప్రభుత్వాసుపత్రులు

Sep 12 2015 1:12 PM | Updated on Aug 18 2018 8:10 PM

ప్రైవేట్ కళాశాలలకు 8 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను అప్పగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.

ఏలూరు : ప్రైవేట్ కళాశాలలకు 8 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను అప్పగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, హిందూపురం, చిత్తూరు, ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రులు ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు ఇచ్చిన జాబితాలో ఉన్నాయన్నారు.

 ఈ ఆసుపత్రులు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో పని చేస్తాయని చెప్పారు. పట్టిసీమ తరహాలనే పోలవరం ప్రాజెక్టుని కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే త్వరలోనే వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు భర్తీ చేస్తామని కామినేని శ్రీనివాస్ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement