వండిందే మెనూ.. పెట్టిందే తిను | Sakshi
Sakshi News home page

వండిందే మెనూ.. పెట్టిందే తిను

Published Tue, Jul 26 2016 1:14 AM

వండిందే మెనూ.. పెట్టిందే తిను - Sakshi

కడప ఎడ్యుకేషన్‌:
 గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు విద్యతోపాటు పౌష్టికాహాకారం అందించాలన్న ఉన్నత సంకల్పంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ సరైన పర్యవేక్షణ, మౌలిక వసతులు లేక, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ముక్కిమూలిగి నడుస్తోంది. ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ ద్వారా అందజేస్తున్న ముక్కిన, పురుగులతో కూడిన బియ్యాన్ని చూస్తే పాలకులకు ఈ పథకం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎంతో తెలిసిపోతుంది. దీంతో విద్యార్థుల ఆరోగ్యం గాలిలో దీపంలా ఉంటోంది.

వంటకోసం ప్రభుత్వం ఇచ్చే బియ్యంలో నాణ్యతగా ఉండటం లేదని, ఎంత జాగ్రత్తగా వండినా సరే అన్నం ముద్ద ముద్దగా అవుతుందని నిర్వహకులే చెబుతున్నారు. ముద్ద ముద్దగా ఉన్న అన్నం తినలేక చాలామంది సగంలోనే వదిలేస్తున్నారు. తింటే చాలామంది పిల్లలకు కడపునొప్పులు వస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇంటి వద్ద నుంచే క్యారియర్లను తెచ్చుకుని పాఠశాలల్లో భోంచేస్తున్నారు. దీనికి తోడు ఎక్కడా కూడా మెనూను పాటించటం లేదు. ఇలా చేస్తే విద్యార్థులకు పౌష్టికాహారం ఎక్కడ అందుతుందని పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాలో పలు స్కూళ్లలో సోమవారం ‘సాక్షి’ చేసిన పరిశీలనలో ఈ విషయాలు వెలుగుచూశాయి.
తింటున్నది సగం మందే
చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని సగంమంది విద్యార్థులు మాత్రమే తింటున్నారు. బద్వేల్‌లోని మున్సిపల్‌ పాఠశాలలో 139 మంది విద్యార్థులు ఉండగా 94మంది మాత్రమే పాఠశాలకు హాజరుకాగా ఇందులో మధ్యాహ్న భోజనానికి 31మంది మాత్రమే హాజరై మధ్యాహ్న భోజనం చేశారు. అలాగే బద్వేల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో వండిన భోజనం సరిగా లేక చాలామంది తినకుండానే పడేసినట్లు తెలిసింది. వల్లూరు జెడ్పీ ఉన్నత పాuý శాలలో కూడా అన్నం ముద్దముద్దగా ఉండటంతో చాలామంది భోజనం చేయలేదు. ఎర్రగుంట్లలో మోను ప్రకారం గుడ్డుపెట్టాల్సి ఉండగా పెట్టలేదు. ఇలా చాలా పాఠశాలలో పరిస్థితి కొనసాగుతుంది.
అందని బిల్లులు
విద్యార్థులు భోజనం వడ్డించేది ఒక ఎత్తు అయితే వారికి బిల్లులు చెల్లించడం మరో ఎత్తులా ఉంది. మధ్యాహ్న భోజనానికి సంబంధించి గత నాలుగు నెలలుగా బిల్లులు అందలేదని నిర్వాహకులు తెలిపారు. దీంతో మధ్యాహ్న భోజనం వండటం కష్టంగా ఉందని పలవురు అవేదనను వ్యక్తం చే శారు. అప్పులు తెచ్చి పిల్లలకు వండిపెడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి బిల్లులను చెల్లించాలని కోరారు.
సగం వాటికే వంటగదులు:
కొందరు భోజన నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలల్లో వండుతున్నా.. మరి కొందరు మాత్రం ఇళ్ల వద్ద వండుకుని పాఠశాలకు తెచ్చి వడ్డిస్తున్నారు. మరికొంతమంది  చెట్ల కింద, ఆరుబయట, పాఠశాల వరండాల్లో వంటను కానిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా నేటికి సగం పాఠశాలలకే వంటగదులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 3340 పాఠశాలల్లో వంటగదులు అవసరం ఉండగా 17వందల పాఠశాలల్లో మాత్రమే వంటగదులు ఉన్నాయి. మిగతా 1,646 పాఠశాలల్లో వంటగదులు లేవు. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కలిపి రోజుకు  2,18,517 మంది  బాలబాలికలు మధ్యాహ్న భోజనం తింటుంటారు. వసతుల లేమి కారణంగా వీరి ఆరోగ్యం గాలిలో దీపంలా సాగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అన్ని పాఠశాలలకు వంటగదులను ఏర్పాటు చేయాల్సిన అçవసరం ఎంతైనా ఉంది.
ఇవ్వవలసింది              ప్రైమరీ              అప్పర్‌ప్రమరీఅండ్‌ హైస్కూల్స్‌
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––
కెలరిక్‌                      450                     700
ప్రొటీన్స్‌                    12                       20
ఆర్‌అండ్‌ వీట్‌            100 గ్రాములు         150 గ్రాములు
దాల్‌                        20 గ్రాములు           30 గ్రాములు
విజిటబుల్‌                 50 గ్రాములు           75 గ్రాములు
ఆయిల్‌ఆండ్‌ ప్యాట్‌       5 గ్రాములు             7.5 గ్రాములు
––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ప్రైమరీ విద్యార్థికి రోజుకు : రూ.  4.86 పైసలు
యూపీ, జెడ్పీ విద్యార్థికి రోజుకు: రూ. 6.78 పైసలు
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు: 3,439
మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఉన్న పాఠశాలలు : 3,439
వంటగదులున్న పాఠశాలలు: 1,793
 వంట గదులు లేని పాఠశాలలు: 1,646
 పాఠశాలల్లో వంటగదుల నిర్మాణానికి స్థలం లేనివి: 438
రోజుకు మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు: 2,18,517
1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులు : 1,20,282
6 నుంచి 8వ తరగతి వరకూ చదివు విద్యార్థుల సంఖ్య: 61,190
9, 10 తరగతుల్లో  చదువు విద్యార్థులు సంఖ్య: 37,045
 ఇలా అందరికి కలిపి రోజుకు 14,843 కేజీలు అవసరంగా అధికారులు గుర్తించారు. నెలకు 700 టన్నుల బియ్యం మధ్యాహ్న భోజన పథకానికి పౌరసరఫరాల అధికారులు సరఫరా చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement