పోలీసుల అదుపులో కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి | kamireddypalli sudhakarreddy in police custody | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి

Nov 29 2016 11:10 PM | Updated on Aug 21 2018 7:17 PM

పోలీసుల అదుపులో కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి - Sakshi

పోలీసుల అదుపులో కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి

ధర్మవరం 34 వార్డు కౌన్సిలర్‌ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతపురం సెంట్రల్‌ : ధర్మవరం 34 వార్డు కౌన్సిలర్‌ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ధర్మవరం మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిల్‌ మీటింగ్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా పట్టణ సీఐ హరినా«థ్‌ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక వాహనంలో ధర్మవరం నుంచి అనంతపురం ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు.

మధ్యాహ్నం 12. 30 గంటల సమయంలో లోపలికి తీసుకెళ్లారు. సుధాకర్‌రెడ్డితో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించిగా పోలీసులు అనుమతించలేదు.  ఫొటోలు కూడా తీయొద్దని సీఐ హరినాథ్‌ వారించారు. కాగా రెండేళ్ల నుంచి సుధాకర్‌రెడ్డిపై ఎలాంటి కేసులు లేవు. ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ధర్మవరంలో చర్చనీయాంశమైంది. ఎందుకు కస్టడీలోకి తీసుకున్నారో వివరాలు కూడా వెల్లడించకుండా పోలీసులు తీసుకొచ్చినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement