అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా ఎన్డీయే | k.laxman prices NDA government and ambedkar | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా ఎన్డీయే

Nov 27 2016 1:54 AM | Updated on Sep 4 2017 9:12 PM

అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా ఎన్డీయే

అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా ఎన్డీయే

బాబా సాహెబ్ డా. అంబేడ్కర్ జీవిత ఆశయాలను నెరవేర్చడానికి అడుగులు వేసిన మొదటి ప్రభుత్వం ఎన్డీయేనని బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బాబా సాహెబ్ డా. అంబేడ్కర్ జీవిత ఆశయాలను నెరవేర్చడానికి అడుగులు వేసిన మొదటి ప్రభుత్వం ఎన్డీయేనని బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవంగా నవంబర్ 26వ తేదీని ప్రకటించి, 2015లో రాజ్యాంగ గౌరవాన్ని, దేశ పౌరుల బాధ్యతను గుర్తిస్తూ పార్లమెంట్‌లో చర్చించిన ఘనత ప్రధాని మోదీదేనని అన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం అంబేడ్కర్‌ను దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించిందన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం బీజేపీ కార్యాలయంలో ఎస్సీసెల్ అధ్యక్షుడు వేముల ఆశోక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు, నల్లధనాన్ని, అవి నీతిని అరికట్టేందుకు పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement