శ్రీశైలం డ్యాంకు పెరిగిన వరద ఉధృతి | flood to srisailam dam | Sakshi
Sakshi News home page

శ్రీశైలం డ్యాంకు పెరిగిన వరద ఉధృతి

Aug 6 2016 1:08 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైలం డ్యాంకు పెరిగిన వరద ఉధృతి - Sakshi

శ్రీశైలం డ్యాంకు పెరిగిన వరద ఉధృతి

నదీ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైల జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీరు విడుదలవుతోంది.

శ్రీశైలం ప్రాజెక్టు: నదీ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైల జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీరు విడుదలవుతోంది. శుక్రవారం సాయంత్రం సమయానికి 42,316 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరింది. వరద ఉధతి జూరాలకు భారీగా పెరగడంతో 2,59,070 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి వరద పోటెత్తడంతో శుక్రవారం మధ్యాహ్నం హంద్రీ నీవా సుజలస్రవంతికి 350 క్యూసెక్కుల నీటి విడుదలను ప్రారంభించారు. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాలలో డిమాండ్‌ను అనుసరించి పీక్‌లోడ్‌ అవర్స్‌లో సగటున 12వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 56.0840 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 835.80 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement