రెచ్చిపోయిన పచ్చపార్టీ నేతలు.. ఎస్సైకి గాయం

TDP Leaders Attack on YSRCP Workers in  - Sakshi

తేలప్రోలులో వినాయక నిమజ్జనం సందర్భంగా ఘర్షణ  

సాక్షి, ఉంగుటూరు: కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తేలప్రోలు గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. గ్రామంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. దీంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకున్నాయి. ఘర్షణలో టీడీపీ వర్గం రాళ్లు రువ్వింది. దీంతో ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావుతోపాటు ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.  గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. టీడీపీ శ్రేణుల దాడులపై వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top