హనీట్రాప్‌ కేసులో హీరోయిన్లు? 

Several Sandalwood stars involved in karnataka honey trap scandal - Sakshi

కర్ణాటక పోలీసుల అనుమానాలు 

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ట్రాప్‌ చేసిన హనీట్రాప్‌ కేసులో కొందరు సినీ హీరోయిన్లకు కూడా సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన ముగ్గురు నటీమణుల పాత్ర ఇందులో ఉన్నట్లు సీసీబీ పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఒకరు ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ కాగా, మరో ఇద్దరు రెండు, మూడు సినిమాల్లో నటించిన వారని సమాచారం. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించి త్వరలోనే వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు సుమారు 25కు పైగా చిత్రాల్లో పలువురు ప్రముఖ హీరోలతో నటించిన హీరోయిన్‌గా భావిస్తున్నారు. 

మరో తార చిన్న సినిమాలు టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలలో కనిపించారు. ఇక మూడో నటి బహుభాషా చిత్రాల్లో నటించిన హీరోయిన్‌గా గుర్తించారు. వారం క్రితం బహిర్గతమైన హనీట్రాప్‌ బాగోతంలో పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల శృంగార వీడియోలు బయటపడ్డాయి. రాఘవేంద్ర అనే వ్యక్తి తన ప్రియురాలు, కొందరు యువతులను ఎమ్మెల్యేల వద్దకు పంపి పరిచయాలు పెంచుకున్నాడు. వారితో నాయకులు గడుపుతున్న రహస్య వీడియోలు సేకరించి భారీగా డబ్బు డిమాండ్‌ చేయడం, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రాఘవేంద్ర, అతని ప్రియురాలు పోలీసుల అదుపులో ఉన్నారు.

చదవండి:

వీఐపీల ఫోన్‌ డేటా ఆమె గుప్పిట్లో

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top