ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి దీక్ష

Lover Boy Cheating Issue  Case In Warangal - Sakshi

ఎల్కతుర్తి : తనను శారీరకంగా వాడుకుని తీరా పెళ్లి చేసుకొమ్మంటే తప్పించుకు తిరుగుతున్న ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు దీక్షకు దిగిన సంఘటన బుధవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శ్రీపతి శ్వేత ఇంటర్‌ చదివే రోజుల్లో అదే మండలానికి చెందిన సట్ల సుధీర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్వేత హైదరాబాద్‌లోని ఓ బ్యూటీషియన్‌ సంస్థలో సభ్యురాలిగా పని చేస్తోంది.

సుధీర్‌ సైతం హెచ్‌డీఎఫ్‌సీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ హైదరాబాద్‌లో ఓ అద్దె గదిలో సహజీవనం చేస్తున్నారు.  గదిలోనే తాళి సైతం కట్టాడని శ్వేత తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పెద్ద మనుషులు కలుగజేసుకుని పెళ్లి కోసం ప్రయత్నాలు చేశారు. దీనికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం తాను లేని సమయంలో గదిలోకి ఎవరో యువకుడు వచ్చాడంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, తనను అనుమానిస్తూ గొడవపడ్డాడని.. అప్పటి నుంచి తాను పెళ్లి చేసుకోనంటూ తప్పించుకు తిరుగుతున్నాడని స్వేత బోరున విలపించింది.

ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు.పెద్ద మనుషులు సైతం పట్టించుకోలేదు. దీంతో తాను ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు దిగినట్లు తెలిపింది. బాధితురాలి మౌనపోరాటానికి  మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. ఇదిలా ఉండగా సుధీర్‌ తండ్రి మల్లయ్య తనను ఓ విలేకరి రూ. 5లక్షలు ఇస్తే సముదాయిస్తానని, లేకుంటే ఇంటి ముందు బైఠాయిస్తుందని చెప్పాడని, తాను డబ్బులు ఇవ్వకపోవడంతో అనుకున్న ప్రకారం ఇలా జరిగిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top