
బంజారాహిల్స్: ఆలయంలో తనను పెళ్లి చేసుకున్న యువకుడు పెళ్లి జరిగిన మరుసటి రోజే అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడంటూ బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఇందిరానగర్‌కు చెందిన పద్మకు ఈ నెల 8న తన స్నేహితురాలు సహకారంతో చిలుకూరి సమీపంలోని మాతాగాయత్రి మందిర్‌లో వీరభద్రతో వివాహం జరిగింది. అదే రోజూ ఇద్దరూ కలిసి ఇందిరానగర్‌లోని తమ గదికి వచ్చారు. మర్నాడు టిఫిన్ తీసుకొని వస్తానని బయటికి వెళ్లిన వీరభద్ర తిరిగి రాకపోవడంతో బాధితురాలు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.