బుధరావుపేటలో బాలిక కిడ్నాప్‌ కలకలం

Girl Kidnapping Case In Warangal - Sakshi

ఖానాపురం(నర్సంపేట): ఆరుబయట ఆడుకుం టుండగా తొమ్మిదేళ్ల బాలికను ఇద్దరు మహిళలు, ఒక దుండగుడు ఆటోలో వచ్చి కిడ్నాప్‌నకు యత్నించిన సంఘటన శనివారం కలకలం సృష్టించింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావుపేటలో ఈ ఘటన జరి గింది. స్థానికులు, ఎస్సై మ్యాక అభినవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బుధరావుపేట గ్రామ పరిధి లోని బోడ్యతండాకు చెందిన ఎంపీటీసీ సభ్యురాలు లకావత్‌ జ్యోతి, రవి దంపతులకు కుమార్తె ఝాన్సీ(9), కుమారుడు వంశీ ఉన్నారు. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా శనివారం పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉన్నారు. తండ్రి రవి నర్సంపేటలో పని నిమిత్తం వెళ్లగా, తల్లి జ్యోతి ఇంట్లో పనులు చేసుకుంటోంది. బాలిక ఝాన్సీ సమీపంలోని అంగన్‌వాడీ సెంటర్‌ వద్ద తోటి పిల్ల లతో ఆడుకుంటోంది.

ఈ క్రమంలో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఆటోలో వచ్చారు. తమకు ఒక చిన్నారి కావాలని, గుడిలో పూజ చేసిన తర్వాత వెంటనే తీసుకువస్తామని అంగన్‌వాడీ ఆయాతో చెప్పగా నిరాకరించింది. దీంతో వారు ఆటోలో వెళ్లి.. మళ్లీ వెనక్కు వచ్చి బాలిక ఝాన్సీకి మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకుని వెళ్లిపోయా రు. అంగన్‌వాడీ కేంద్రంలో నుంచి ఆయా బయటకు వచ్చి చూడగా బాలిక ఝాన్సీ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వారికి తెలియజేయగా, వారు బాలిక తల్లి జ్యోతికి చెప్పారు. ఆమె భర్త రవికి తెలియజేయగా వెంటనే 100కు డయల్‌ చేశాడు. మంగళవారిపేటలో ఎంపీపీ రవీందర్‌రావు, అక్కడి యువకులకు సమాచారం అందించారు. రెండు గ్రామాలకు చెందిన యువకులు ఆటోలను ఆపి తనిఖీలు చేయడం ప్రారంభించారు.

అప్పటికే ముగ్గురు స్థానిక మురారీ హోటల్‌లో బాలికతో కలిసి టిఫిన్‌ చేస్తున్నారు. గమనించిన యువకులు వెళ్లి వారిని పట్టుకున్నారు. బాలిక తండ్రి రవి చేరుకుని వారిపై ఆగ్రహిస్తూ చేయిచేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై అభినవ్‌ వెంటనే సిబ్బందితో వచ్చి దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఆటోతో పాటు ఇద్దరు మహిళలు, పురుషుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించా రు. కాగా కిడ్నాప్‌నకు యత్నించిన వారి ద్వారా గతంలో మృతిచెందిన ఇర్షద్‌ మృతి వివరాలు తెలుస్తాయని ముస్లింలు సైతం తరలివచ్చారు. కాగా ఎస్సై అభినవ్‌ విచారణ చేస్తున్నామని, వివరాలు తెలియలేదని వారికి చెప్పి పంపారు. రూరల్‌ సీఐ సతీష్‌బాబు చేరుకొని ఎస్సై అభినవ్‌తో కలిసి విచారణ చేపట్టారు. కాగా డీసీపీ అనురాధ సాయంత్రం ఖానాపురానికి చేరుకుని కిడ్నాప్‌నకు యత్నం ఘటనపై పోలీస్‌ సిబ్బందితో చర్చించారు. అక్కడే ఉన్న ఎంపీపీ రవీందర్‌రావు, జడ్పీటీసీ సభ్యుడు జగన్మోహన్‌రెడ్డి, బాలిక తండ్రి లకావత్‌ రవితో మాట్లాడారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నా రు. ఏసీపీ సునితామోహన్, సీఐ, ఎస్సై ఉన్నారు. 

భయాందోళనలో గ్రామస్తులు

గ్రామంలో పట్టపగలే బాలికను కిడ్నాప్‌కు యత్నించడంతో గ్రామంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత ఏడాది జూలై నెలలో ఇదే గ్రామానికి చెందిన ఇర్షద్‌ అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఇలాగే మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేయగా మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని భీమునిపాదం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం విధితమే. ఇదే తరహాలో మళ్లీ ఏడాది తర్వాత బాలిక ఝాన్సీని కిడ్నాప్‌నకు యత్నించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top