ప్లాట్ల పేరుతో ఘరానా మోసం..

Fraudulent Fraud On The Plots Jangaon - Sakshi

ప్లాట్‌ బుకింగ్‌ పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ.20 వేలు వసూలు

రూ. 4లక్షలతో ఉడాయించిన మోసగాడు

బచ్చన్నపేట/జనగామ: మండల కేంద్రంలో పలువురికి హైదరాబాద్‌లో ప్లాట్లు ఇప్పిస్తానని డబ్బులను తీసుకొని రూ.4లక్షల రూపాయలతో ఉడాయించిన ఘటన మండల కేంద్రంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై రంజిత్‌రావు కథనం ప్రకారం..మండల కేంద్రానికి చెందిన బొమ్మ నర్సింహులుకు చేనేత మగ్గాలు ఉన్నాయి. ఈ మొగ్గాలను నేయడానికి హైదరాబాద్, ఎల్‌బీ నగర్, సాయిసప్తగిరి కాలనీకి చెందిన శింగం కిష్టయ్య 4 నెలల క్రితం వచ్చాడు.

గడిచిన 4 నెలలుగా మగ్గం నేచుకుంటూ గ్రామంలో అందరితో చనువు పెంచుకున్నాడు. హైదరాబాద్‌లో ప్రభుత్వం నిరుపేదలకు ప్లాట్లు ఇస్తుందని, ఆ ప్లాట్‌ కావాలంటే ముందుగా రూ. 20 వేలు చెల్లించి బుక్‌ చేసుకోవాలని తెలిపాడు. తక్కువ ధరకే ప్లాట్‌ వస్తుండడంతో దాదాపు 20 మంది 20 వేల చొప్పున రూ.4 లక్షల వరకు కిష్టయ్యకు అందించారు. ఉన్నట్టు ఉండి కిష్టయ్య వారం రోజులుగా కనిపించడం లేదు.

 డబ్బులు ఇచ్చిని వారు ఎక్కడ వెదికినా అతని ఆచూకీ కనిపించలేదు.  ఈ విషయమై బొమ్మ నర్సింహులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో, అలాగే జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డికి కూడా బుధవారం ఫిర్యాదు ఇచ్చాడని ఎస్సై రంజిత్‌రావు తెలిపారు. ఈ వివరాల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా బాధి తులు మాట్లాడుతూ  మగ్గం నేసుకుని నెల నెల వ చ్చే మిగులు డబ్బులతో బతికే తమ లాంటి కుటుంబాలను మోసం చేసిన వ్యక్తిని పట్టుకోవా లని కోరారు. తమలాంటి వారు మోసపోకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top