డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య | Degree Student Commits Suicide Anantapur | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

Feb 27 2019 12:19 PM | Updated on Feb 27 2019 12:19 PM

Degree Student Commits Suicide Anantapur - Sakshi

వాణి (ఫైల్‌)

అనంతపురం, నల్లచెరువు: పల్లెవాండ్లపల్లికి చెందిన వెంకటరమణ కుమార్తె వాణి (19) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన మేరకు... వాణి కదిరిలోని బ్లూమూన్‌ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మూడు రోజుల నుంచి మౌనంగా ఉంటున్న వాణి సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు గమనించి హుటాహుటిన కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement