కాంగ్రెస్ మహిళ నేత దారుణ హత్య | Congress Ex Corporator Murder In Vizag | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ మాజీ మహిళ కార్పొరేటర్ దారుణ హత్య

Feb 26 2019 12:51 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Ex Corporator Murder In Vizag - Sakshi

సాక్షి, విశాఖపట్నం : కాంగ్రెస్ మాజీ మహిళ కార్పొరేటర్ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. రక్తపు మడుగులో బాత్రూంలో శవమై తేలిన ఆమెను అపార్ట్‌మెంట్‌ కోనుగోలు చేయడానికి వచ్చినవారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కయపాలెం ఎన్జీఓఎస్‌ కాలనీలోని పద్మ భాస్కర అపార్ట్‌మెంట్‌లోని అయిదో ఫ్లోర్‌లో ఆమె నివాసం ఉంటున్నారు. విశాఖ నగర మాజీ కార్పోరేటర్‌ అయిన విజయారెడ్డి హత్యకు గురవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలి భర్త బ్యాంక్‌ ఉద్యోగి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున‍్నారు. కేసు నమోదు చేసుకుని, సీసీ టీవీ పుటేజ్‌ ఆధారంగా విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement