
సాక్షి, న్యూఢిల్లీ : చైన్ స్నాచింగ్‌లు దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డుపై చైన్‌స్నాచింగ్ జరిగింది. ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఇందేర్‌పూరి ఏరియాకు చెందిన ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు బైక్ దిగి, వెనుక నుంచి మహిళ వద్దకు బలవంతంగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు. అతని నుంచి తప్పించుకునేందుకు మహిళ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కిందపడేసీ మరీ గొలుసు లాక్కెళ్లాడు. కాగా ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.