హోం క్వారంటైన్‌కు నిరాకరించిన వ్యక్తిపై కేసు

Case against a man who refused to home quarantine - Sakshi

ఎల్లారెడ్డిపేట: విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు చెబుతున్నప్పటికీ నిరాకరించిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌ నగర్‌కు చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ ఈ నెల 18న దుబాయ్‌ నుంచి ఇంటికి వచ్చాడు. మొదటి రోజే శ్రీనివాస్‌గౌడ్‌ను స్వీయ నిర్బంధం కావాలని అధికారులు కోరారు.

అయినా అతను బయట తిరగడం ప్రారంభించాడు. ఈ నెల 21న అధికారులు ఆయన ఇంటి వద్దకు వెళ్లే సరికి ఫ్రిజ్‌ కొనుగోలు కోసమని సిరిసిల్లకి వెళ్లాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం అర్ధరాత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై స్వీయ నిర్బంధ నిరాకరణ కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top