మున్సిపల్‌ వర్కర్‌ దారుణ హత్య | The Brutal Murder Of a Municipal Worker | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ వర్కర్‌ దారుణ హత్య

May 15 2018 11:01 AM | Updated on May 15 2018 11:01 AM

The Brutal Murder Of a Municipal Worker - Sakshi

హత్యకు గురైన రవి(ఫైల్‌)

ఇల్లెందు (ఖమ్మం) : సహచరుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు మద్యం మత్తులో ఘర్షణపడడంతో మున్సిపల్‌ వర్కర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం సాయంత్రం ఇల్లెందు మున్సిపల్‌ శానిటేషన్‌ విభాగంలో పనిచేసే వర్కర్‌ నాతారి రవి(30) మొండితోగు శ్మశానవాటిక సమీపంలో విగతజీవిగా పడి ఉన్న సమాచారం పోలీసులకు చేరింది.

శ్మశాన వాటికకు చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో పడి ఉన్న రవిని హుటాహుటిన హాస్పిటల్‌కు చేర్చారు. అప్పటికే రవి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇల్లెందు వినోభానగర్‌ ఏరియాకు చెందిన రవి తన స్నేహితుడు ముకేష్‌తో కలిసి అదే ఏరియాకు చెందిన కృష్ణ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు.

అంత్యక్రియల సందర్భంగా అక్కడ మద్యం సేవించారు. పరస్పరం రవి, ముకేష్‌లు గొడవ పడ్డారు. ఈ ఘర్షణలో ముకేష్‌ రవిని రాయితో కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. సీఐ సారంగపాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement