రిలయన్స్‌ జియో... వై–ఫై కాలింగ్‌ సేవలు

Reliance Jio Launches Voice And Video Calling Over Wi-Fi - Sakshi

న్యూఢిల్లీ: వై–ఫై ద్వారా కూడా వాయిస్, వీడియో కాలింగ్‌ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు టెలికం సంస్థ రిలయన్స్‌ జియో వెల్లడించింది. దీనితో ఇళ్లలో లేదా ఆఫీసుల్లో కాల్స్‌ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్‌టీఈ నుంచి వై–ఫైకి మారవచ్చ ని పేర్కొంది. జనవరి 16లోగా దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు జియో వివరించింది. పోటీ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ ఇప్పటికే ఈ తరహా సర్వీసులను ఢిల్లీ–నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌)లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో జియో ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top