24% పెరిగిన దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య | Domestic air passenger traffic up 23% in 2016: DGCA | Sakshi
Sakshi News home page

24% పెరిగిన దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య

Jan 18 2017 1:29 AM | Updated on Sep 5 2017 1:26 AM

24% పెరిగిన దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య

24% పెరిగిన దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య

దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. 2015 డిసెంబర్‌ పోల్చుకుంటే 2016 డిసెంబర్‌లో 24% పెరిగినట్లు డీజీసీఏ వెల్లడించింది.

న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. 2015 డిసెంబర్‌ పోల్చుకుంటే 2016 డిసెంబర్‌లో 24% పెరిగినట్లు  డీజీసీఏ వెల్లడించింది. 2015 డిసెంబర్‌లో 77.09 లక్షల మంది విమాన సేవల్ని వినియోగించుకోగా..ఈ సంఖ్య 2016 డిసెంబర్‌లో 95.52 లక్షలకు చేరినట్లు వివరించింది. గత పూర్తి ఏడాదిలో సుమారుగా పది కోట్ల మంది ప్రయాణించగా.. 2015లో ఈ సంఖ్య 8.2 కోట్లుగా ఉంది. 11 దేశీయ విమానయాన సంస్థల్లో   ఇండిగో ఎయిర్‌లైన్స్‌ డిసెంబర్లో 38.48 లక్షల మందిని గమ్యస్థానానికి చేర్చి టాప్‌లో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement