రాష్ట్రానికి చెం దిన వీఎస్‌టీ ఇండస్ట్రీస్ 2013-14 ఆర్థిక సంవత్సరానికి షేరుకు రూ.70 డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్ రికార్డు తేదీని
వీఎస్‌టీ డివిడెండ్... రూ.70
Apr 23 2014 2:19 AM | Updated on Sep 2 2017 6:23 AM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెం దిన వీఎస్‌టీ ఇండస్ట్రీస్ 2013-14 ఆర్థిక సంవత్సరానికి షేరుకు రూ.70 డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ డివిడెండ్ రికార్డు తేదీని ఆగస్టు 25గా నిర్ణయించగా, దీనికి ఆగస్టు 12న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం ఆమోదం తెలపాల్సి ఉంది. గతేడాది వీఎస్‌టీ రూ.62.5 డివిడెండ్‌ను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో వీఎస్‌టీ రూ.377 కోట్ల ఆదాయంపై రూ.52 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2013-14 పూర్తి ఏడాదికి రూ.1,627 కోట్ల ఆదాయంపై రూ.150 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. మంగళవారం బీఎస్‌ఈలో ఈ షేరు .15శాతం పెరిగి రూ.1,780 వద్ద ముగిసింది.
Advertisement
Advertisement