బయోకాన్‌ సైటోసార్బ్‌ చికిత్సకు ఓకే

Biocon gets nod for CytoSorb  - Sakshi

అనుమతించిన డీసీజీఐ

కోవిడ్‌-19 రోగుల చికిత్సకు వినియోగం

విదేశాలలో ఇప్పటికే వాడకం

కోవిడ్‌-19 సోకిన రోగులలో సైటోసార్బ్‌ చికిత్సకు ఔషధ నియంత్రణ అధీకృత సంస్థ(DCGI) నుంచి బయోకాన్‌ బయోలాజిక్స్‌కు అనుమతి లభించింది. దేశీ బయోఫార్మాస్యూటికల్‌ కంపెనీ బయోకాన్‌ను ఇది అనుబంధ సంస్థకాగా.. అత్యవసర వినియోగం కింద సైటోసార్బ్‌ థెరపీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో 18ఏళ్ల వయసుపైబడిన రోగులలో శ్వాసకోస సంబంధ తీవ్ర సమస్యలు తలెత్తినప్పుడు సైటోసార్బ్‌ డివైస్‌ను వినియోగించేందుకు వీలు కలిగినట్లు వివరించింది. ఐసీయూలో చికిత్సచేసే రోగులలో ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్స్‌ను ఇది తగ్గిస్తుందని తెలియజేసింది. కాగా.. ఇటలీ, చైనా, జర్మనీలలో 750 మందికిపైగా కోవిడ్‌-19 వ్యాధిగ్రస్తులకు సైటోసార్బ్‌ను వినియోగించినట్లు బయోకాన్‌ పేర్కొంది. కోవిడ్‌-19 రోగులలో సీఆర్‌ఎస్‌ పరిస్థితి తలెత్తినప్పుడు ఇతర అవయవాలు దెబ్బతినే వీలుంది. ఈ సమయంలో సైటోసార్బ్‌ చికిత్స ద్వారా సైటోకైన్‌ను నియంత్రించడం, రక్తాన్ని శుద్ధి చేయడం వంటివి చేపట్టేందుకు వీలుంటుందని వివరించింది. తద్వారా ప్రమాదాలను తగ్గించడం లేదా నివారించేందుకు వీలుంటుందని వివరించింది. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బయోకాన్‌ షేరు 1.2 శాతం క్షీణించి రూ. 355 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 363 వద్ద గరిష్టాన్నీ, రూ. 351 వద్ద కనిష్టాన్నీ తాకింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top