అమర రాజా నికర లాభం | Amara Raja Batteries Q4 net surges 27.74% | Sakshi
Sakshi News home page

అమర రాజా నికర లాభం

May 30 2015 1:17 AM | Updated on Sep 3 2017 2:54 AM

అమర రాజా నికర లాభం

అమర రాజా నికర లాభం

అమర రాజా బ్యాటరీస్ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసిక నికర లాభంలో 28 శాతం వృద్ధి నమోదయ్యింది.

రూ. 102 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసిక నికర లాభంలో 28 శాతం వృద్ధి నమోదయ్యింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ. 80 కోట్లుగా ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 102 కోట్లకు చేరింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 21 శాతం వృద్ధితో రూ. 885 కోట్ల నుంచి రూ. 1,066 కోట్లకు పెరిగింది.

ఏడాది మొత్తం మీద కంపెనీ రూ. 4,211 కోట్ల ఆదాయంపై నికరలాభం రూ. 411 కోట్లుగా నమోదయ్యింది. ఆటోమోటివ్ బ్యాటరీల విభాగంలో రెండంకెల వృద్ధి నమోదు కావడంతో రికారు స్థాయి ఫలితాలను నమోదు చేయగలిగినట్లు అమర రాజ బ్యాటరీస్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ జయదేవ్ గల్లా తెలిపారు. ప్రతీ షేరుకు రూ. 3.61 డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement