రూ.1,212కే విమాన టికెట్‌: ఇండిగో

1212 On 12 Lakh Seats. Routes And Other Details - Sakshi

ముంబై: ‘ఇండిగో’ తాజాగా ‘మెగా వార్షికోత్సవ సేల్‌’ పేరుతో టికెట్‌ ధరల డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా టికెట్లను రూ.1,212 ధర నుంచి అందిస్తోంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు (జూలై 10 నుంచి 13 వరకు) అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్నవారు ఈ ఏడాది జూలై 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 మధ్య ఎప్పుడైనా ప్రయాణించ్చొని కంపెనీ తెలిపింది.

మెగా వార్షికోత్సవ సేల్‌లో భాగంగా ప్రయాణికుల కోసం 12 లక్షల సీట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. ‘ఆగస్ట్‌ 4న సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి 12 సంవత్సరాలు అవుతుంది. అందుకే 12 లక్షల సీట్లతో మెగా సేల్‌ను ప్రకటించాం’ అని ఇండిగో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ విలియమ్‌ బౌల్టర్‌ తెలిపారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top