ప్రియుడిపై చీటింగ్‌ కేసు.. | woman filed cheating case against boyfriend in bhadradri | Sakshi
Sakshi News home page

ప్రియుడిపై చీటింగ్‌ కేసు..

Feb 14 2018 3:08 PM | Updated on Aug 1 2018 2:29 PM

woman filed cheating case against  boyfriend in bhadradri - Sakshi

సుజాతనగర్‌ : పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేసిన ప్రియుడిపై సుజాతనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్సై రతీష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నా యి. ములకలపల్లి మండలం పూసుగూడేనికి చెందిన బోడ రాజమ్మ, సుజాతనగర్‌ మండలం సీతంపేటబంజరకు చెందిన లావుడ్య వెంకటేశ్వర్లు బీఈడీ చదువుతున్న సమయంలో స్నేహితులు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరి మధ్య శారీరకంగా కూడా చనువు ఏర్పడింది. ఇటీవల వివాహం చేసుకుందామని వెంకటేశ్వర్లును రాజమ్మ కోరగా అందుకు నిరాకరించి ముఖం చాటేశాడు. దీంతో రాజమ్మ ప్రియుడి ఇంటి ఎదుట వారం రోజులపాటు మౌనదీక్ష చేసింది. అదే సమయంలో ఇరువురూ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం సైతం చేశారు. అయినప్పటికీ వెంకటేశ్వర్లు మాత్రం రాజమ్మను వివాహం చేసుకునేందుకు నిరాకరించడంతో అతనిపై సుజాత నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదు చేశారు. వెంకటేశ్వర్లుతోపాటు అతనికి సహకరించిన బంధువులు తులసీరాం, బానోతు ధన్‌రాజ్, రవి, పుష్పావతి, కుషాదేవి, సరస్వతి, కవితపై సైతం కేసు నమోదైనట్లు ఎస్సై రితీష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement