హరికృష్ణకి వైఎస్సార్‌సీపీ నివాళులు

YSRCP Leaders Condolence To Nandamuri Harikrishna - Sakshi

సాక్షి, అమరావతి : రాజ్యసభ మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనను షాక్‌కు గురుచేసిందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి  పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్యర్యంలో హరికృష్ణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. గుడివాడ నియోజక వర్గానికి హరికృష్ణకి ఉన్న సంబంధాన్ని ఆయన అభిమానులు గుర్తుచేసుకున్నారు.

హరికృష్ణ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యే అంజద్‌ బాషా, మేయర్‌ సురేష్‌ బాబు విచారం వ్యక్తం చేశారు. హరికృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. హరికృష్ణ మరణం నందమూరి అభిమానులకు తీరని లోటన్నారు. 1999లో హరికృష్ణ ‘అన్నాటీడీపీ’ స్థాపించి, గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన హరికృష్ణకు రధసారధిగా వ్యవహరించానని గుర్తు చేసుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top