తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు విజయమ్మ పర్యటన | YS vijayamma to Visit cyclone hit areas Srikakulam district tomorrow | Sakshi
Sakshi News home page

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు విజయమ్మ పర్యటన

Oct 15 2013 1:41 PM | Updated on Sep 1 2017 11:40 PM

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు విజయమ్మ పర్యటన

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు విజయమ్మ పర్యటన

పై-లీన్ తుపాన్ ప్రభావ శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బుధవారం పర్యటించనున్నారు.

హైదరాబాద్ : పై-లీన్ తుపాన్ ప్రభావ శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బుధవారం పర్యటించనున్నారు.   తుపాన్ వల్ల నష్టపోయిన ప్రాంతాలను ఆమె పర్యటిస్తారు.  బాధితుల్ని పరామర్శిస్తారు . పై-లిన్ విసిరిన పంజాకు శ్రీకాకుళం జిల్లా కకావికలమైంది. భారీగా పంటలకు  నష్టం వాటిల్లింది.  ఇప్పటికీ పలు ప్రాంతాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి.

విద్యుత్ లేక చాలా గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి.  దాంతో విద్యుత్ సరఫరాను పునర్నిర్మించుకోడానికి మత్స్యకారులు తమంతట తాము ముందుకొస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో దాదాపుగా గంటకు 220-240 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతంలో ఏకంగా 832 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు ధ్వంసమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement