ఆదివాసీ దినోత్సవం రోజునే పట్టాల పంపిణీ

YS Jagan Mohan Reddy Holds Review Meeting On ROFR Rails - Sakshi

సాక్షి, అమరావతి: ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం రోజున సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, రెవిన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం రోజున పట్టాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు మేలు చేయాలని అధికారులకు సూచించారు. అటవీ భూములపై సాగు హక్కుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న గిరిజనులకు ప్రయోజనం కల్పించాలన్నారు.

అర్హత ఉన్న వారందరికీ సాగు హక్కులు కల్పించాలని ఆదేశించారు. పట్టాలు ఇచ్చాక ఆయా భూముల అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఆ భూముల్లో ఏం సాగు చేయాలన్న దానిపై కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాలని సూచించారు. దీనిపై వ్యవసాయ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. దీని కోసం 'గిరిభూమి' పేరుతో పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిపారు. (అందరికీ పథకాల ఫలాలు దక్కాలి: వైఎస్​ జగన్​)

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top