లారీని ఢీకొన్న టిప్పర్ | Tippar truck collision | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న టిప్పర్

Jun 27 2015 3:18 AM | Updated on Sep 3 2017 4:25 AM

సామర్లకోట : సామర్లకోట-కాకినాడ కెనాల్ రోడ్డు రైల్వే గేటు సమీపంలో రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వ చ్చిన టిప్పర్ ఢీ కొంది.

సామర్లకోట : సామర్లకోట-కాకినాడ కెనాల్ రోడ్డు రైల్వే గేటు సమీపంలో రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి వ చ్చిన టిప్పర్ ఢీ కొంది. పోలీసుల కథనం ప్రకారం కంకర రాళ్లను తీసుకు వె ళుతున్న లారీ యాక్సిల్ విరిగిపోవడంతో డ్రైవర్ రోడ్డుపై నిలిపి వేవాడు. శుక్రవారం తెల్లవారు జామున పెద్దాపురం నుంచి కాకినాడ వెళుతున్న గ్రావెల్ లోడ్ టిప్పర్ నిలిచి ఉన్న లారీని గమనించకపోవడంతో వెనుక నుంచి ఢీకొట్టింది. టిప్పర్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్లకు తీవ్రగాయాలయ్యాయి.
 
 వారిని స్థానికులు 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన లారీ డ్రైవర్ జబులస్ అసాద్, క్లీనర్ ముకేష్ అసాద్‌లు పెద్దాపురం మండలం సూరంపాలెంలో ఒక ప్రైవేటు కంపెనీలోని టిప్పర్‌లో పని చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. క్లీనర్ పరిస్థితి విషమంగా ఉందన్నారు.
 
  ఏఎస్సై జీవీవీ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలను పక్కకు తొలగించారు. టిప్పర్ల వేగం కారణంగా వరుసగా మూడు రోజులుగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒక ప్రమాదంలో కోరంగి ఎస్సై మృతి చెందగా, మరో రోజు 108 పాడైపోయింది. శుక్రవారం లారీని టిప్పర్ ఢీకొంది. ఈ వరుస ఘటనలతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement