చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు సమీపంలోని పూతలపట్టు ...
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు సమీపంలోని పూతలపట్టు వద్ద ఇన్నోవో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిని దగ్గర్లోని....ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని సమాచారం. తీవ్రంగా గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.