ఉలిక్కిపడ్డ చిన్నరేవల్లి | The suspicious death of a student in america | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడ్డ చిన్నరేవల్లి

Feb 7 2014 4:17 AM | Updated on Apr 4 2019 3:25 PM

ఉన్నత విద్యలో రాణిం చి ఉన్నత స్థాయిలో స్థిరపడతాడనుకున్న యువకుడి తల్లిదండ్రుల ఆశలు తలకిందులయ్యాయి.

బాలానగర్, న్యూస్‌లైన్ :  ఉన్నత విద్యలో రాణిం చి ఉన్నత స్థాయిలో స్థిరపడతాడనుకున్న యువకుడి తల్లిదండ్రుల ఆశలు తలకిందులయ్యాయి. పై చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థి గురువారం అనుమానాస్పదంగా మృతి చెందడంపై త ల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగి తేలారు. తండ్రి బ్రాంచ్ పోస్టుమాస్టర్ శ్రమించి కుమారుడిని ఉన్నత విద్య కోసం అమెరికా పం పాడు. చదువు పూర్తిచేసి మంచి ఉద్యోగం దొరి కిందని ఫోన్ చేస్తారని అనుకున్న సమయంలో హఠాత్తుగా మరణ వార్త రావటం కలచివేసింది. బాలానగర్ మండలం చిన్నరేవల్లికి చెందిన శ్రీధర్‌రెడ్డి బ్రాంచ్ పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఇద్దరు సంతానం. మొదటి సంతానం కూతు ర అ ఖిల, రెండో సంతానం అరవింద్‌రెడ్డి. అఖిల బీఈడీ పూర్తిచేయగా అరవింద్‌రెడ్డి జే పీఎన్‌సీ కళాశాలలో బీటెక్ పూర్తిచేసి ఎంఎస్ కోసం ఫిబ్రవరి 14, 2011లో అమెరికాకు వెళ్లాడు. అక్కడ కాలిఫోర్నియా సంజూస్‌పట్టణంలో యూనివర్సిటీలో చేరి కోర్సు చేస్తున్నాడు.  గత ఏడాది మార్చ్‌లో గ్రీన్‌కార్డు కూడా సంపాదించాడు. మంచి ఉద్యోగంతో తిరిగి వస్తాడనుకున్న అరవింద్‌రెడ్డి ఇలా దుర్మరణం చెందడం కలచివేస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తచేస్తున్నారు.
 
 త్వరలోనే ఇంటికి వస్తానని...
 త్వరలోనే ఇంటికి వస్తానని భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఫోన్ లో మాట్లాడినట్లు  అఖిల తెలిపింది. అయితే ఇలా వస్తాడని ఊహించలేదని బోరున విలపించింది. ఫోన్‌లో మాట్లాడిన కొడుకువి అవే చివరి మాటలు అవుతాయని తాము ఊహించలేదని తల్లిదండ్రులు శ్రీధర్‌రెడ్డి, వాసుదేవిలు వాపోతున్నారు.
 
 షాద్‌నగర్ వెళ్లిన మృతుడి
 కుటుంబసభ్యులు...
  మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు షాద్‌నగర్‌కు వెళ్లారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులు తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తుందేమోనని వారు అక్కడే ఉన్నారు.  గ్రామస్థులు, బంధువులు ఒక్కొక్కరుగా చిన్నరేవల్లిలోని శ్రీధర్‌రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement