
ప్రొద్దుటూరు : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన నవరత్నాల పథకాలు అమలైతే అవి ప్రజలకు నవరత్నాల్లాంటివి అవుతాయని, ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు గ్రామంలో ఆదివారం రావాలిజగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, కల్లూరు గ్రామంలోని 726 ఇళ్లకు సంబంధించి నవరత్నాలపై చేసిన సర్వే వివరాలను వెల్లడించారు. ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ రైతు భరోసా, పేదలందిరికి ఇళ్లు, వైఎస్సార్ ఆసరా, అ మ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్ల పెంపు, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, ఇతర పథకాలను వివరించడంతోపాటు ఏపథకం, ఏ ఇంటికి వర్తిస్తుం ది, ఎంత మేర లబ్ది పొందవచ్చు అనే విషయంపై ఇంటింటా పేర్లు నమోదు చేసి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలను వీరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ గత 9 ఏళ్లుగా వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేశారన్నారు.
గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చెప్పుకోలేరని, మన పార్టీ మాటలనే జనం విశ్వసిస్తారన్నారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా, నష్టమైనా జగన్‌మోహన్‌రెడ్డి నిలబడుతారన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారన్నారు. గత ఎన్నికలకం టే ఈ మారు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేను గె లిపించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ కడప పార్లమె ంట్ కన్వీనర్ సురేష్‌బాబు మాట్లాడుతూ కల్లూరు గ్రామంలో బూత్ కన్వీనర్లు, బూత్ కమిటీ మెంబర్లు చేసిన సర్వేను అభినందించారు. ఇలాంటి సర్వే నిర్వహించడం వలన ఆయా గ్రామాల్లో మెజారిటీని మనం అంచనా వేసుకోవచ్చని తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ఇప్పటిలా కాకుండా ఆయా ఇంజినీరింగ్ కాలేజిలు నిర్దేశించిన పూర్తి ఫీజును చెల్లిస్తామని ప్రకటించారన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే వైఎస్ అవినాష్‌రెడ్డికి ఎప్పటికీ ఓటమి ఉండదని, భవిష్యత్తులో కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని అన్నారు. పార్టీకి నాయకులు, కార్యకర్తలు ఆక్సిజన్‌లాంటివారన్నారు. గత ఎన్నికల్లో కూడా నియోజకవర్గానికి సంబంధించి ప్రొద్దుటూరు మండలంలో కల్లూరు గ్రామంలో 1950 ఓట్లలో 650 ఓట్లు తనకు మెజారిటీ రాగా వెలువలి గ్రామంలో 616 ఓట్లు నారాయణరెడ్డి అన్న ద్వారా వచ్చాయన్నారు.