చుక్కల దుప్పి మృతి..
గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి ఓ చుక్కల జింక మంగళవారం వచ్చింది.
దొరవారిసత్రం: మండలంలోని కల్లూరు గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి ఓ చుక్కల జింక మంగళవారం వచ్చింది. దీనిపై కుక్కలు దాడి చేశాయి. గ్రామస్తులు గుర్తించి జింకను రక్షించి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్‌ఎస్‌ఓ కోటేశ్వరావు, బీట్ ఆఫీసర్ ధనలక్ష్మి గాయపడిన జింకను దొరవారిసత్రం పశువైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. అయితే తీవ్రగాయాలు కావడంతో జింక మృతిచెందిందని ఫారెస్టు అధికారులు తెలిపారు. పోస్టుమర్టం నిర్వహించిన అనంతరం జింకను ఖననం చేశారు.