భయం గుప్పిట్లో పినకడిమి గ్రామస్తులు | Section 144 in Pinakamidi after triple murder | Sakshi
Sakshi News home page

భయం గుప్పిట్లో పినకడిమి గ్రామస్తులు

Sep 26 2014 8:44 AM | Updated on Nov 6 2018 8:51 PM

పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమి మండలం పినకడిమిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ...

ఏలూరు :  పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమి మండలం పినకడిమిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గ్రామంలో 15 చోట్ల పోలీస్ పికెట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు పినకడిమిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. 300మంది పోలీసులతో ప్రతి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

గ్రామంలోకి మీడియా సిబ్బందిని కూడా అనుమతించటం లేదు. పినకడిమి పోలీసుల దిగ్బంధంలో ఉంది. బయటివారిని గ్రామంలోనికి అనుమతించడం లేదు. గ్రామంలో 15 రోజుల పాటు 144 సెక్షన్ విధించారు.  నిందితులు, బాధితుల ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో పోలీసులు అనుక్షణం పహారా కాస్తున్నారు. మరోవైపు ఏలూరులోని కొన్ని అపార్ట్మెంట్లలో కూడా పోలీసులు సోదాలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement