చిత్తూరు జిల్లా ఎర్రావారి పాలెం మండలం ఉచ్చికాయల పెంట వద్ద రూ.32లక్షల విలువైన ఎర్ర చందనాన్ని పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు జిల్లా ఎర్రావారి పాలెం మండలం ఉచ్చికాయల పెంట వద్ద రూ.32లక్షల విలువైన ఎర్ర చందనాన్ని పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వాహనం లో తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు. వాహనాల తనిఖీలో భాగంగా ఎర్ర చందనం పట్టుబడినట్లు తెలుస్తోంది. స్మగ్లింగ్ కు ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.