హైదరాబాద్ మీర్‌పేటలోని ఒక ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది.
మీర్‌పేట : హైదరాబాద్ మీర్‌పేటలోని ఒక ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. వివరాల ప్రకారం.. మీర్‌పేట గాయత్రి నగర్‌లోని ఒక ఇంట్లో శనివారం రాత్రి కుటుంబసభ్యులు నిద్రిస్తుండగా దొంగ తలుపు తెరిచి లోనికి ప్రవేశించాడు. ఇంట్లో ఉన్న 50 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.65 వేల నగదును దోచుకెళ్లాడు. చోరీ జరిగిన విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.