వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మూడో విడత ఏడవ రోజు నిర్వహించిన సమైక్య శంఖారావం పర్యటనకు శనివారం విశేష స్పందన లభించింది.
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మూడో విడత ఏడవ రోజు నిర్వహించిన సమైక్య శంఖారావం పర్యటనకు శనివారం విశేష స్పందన లభించింది. తవణంపల్లె, ఐరాల మండలాల్లో రోడ్‌షోలు జరిగాయి. గ్రామీణ ప్రాంతాలు జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో నిండిపోయూయి.
పూలవర్షం కురి పిస్తూ, బాణసంచా పేలుస్తూ, డప్పు వాయిద్యాలు, కోలాటాలతో అభిమాన నేతను స్వాగతించారు. శుక్రవారం రాత్రి తిరువణంపల్లెలో జగన్‌మోహన్‌రెడ్డి బస చేశారు. ఉదయం అక్కడి నుంచి పర్యటన ప్రారంభించారు. కాణిపాకం వినాయక స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు. అక్కడ నుంచి అగరంపల్లె, ఎల్బీపురం, ఐరాల, ద్వారకాపురం, మారేడుపల్లె క్రాస్‌ల మీదుగా ఉత్తర బ్రాహ్మణపల్లె వరకు రోడ్‌షో నిర్వహించారు. అనంతరం తవణంపల్లె చేరుకోగానే అభిమానులు ఆయనను చుట్టుముట్టారు.
ఘనంగా స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలను మోగించారు. పూలు చల్లవద్దంటున్నా, అభిమానులు వినకుండా పూల వర్షం కురిపించారు. అక్కడ నుంచి మిట్టపల్లె, ముత్యాలమిట్ట, దిగువతడకరలో రోడ్ నిర్వహిం చారు. అక్కడి నంచి మత్యం క్రాస్ చేరుకుని, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.అక్కడ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు.
తరువాత అరగొండ క్రాస్‌కు చేరుకున్నారు. దిగువమత్యంలో రోడ్‌షో నిర్వహించి, ఎగువ మత్యంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అరగొండ క్రాస్, జొన్నగురుకులలో నిర్వహించిన రోడ్‌షోలో జనం నుంచి భారీ స్పందన లభించింది. అక్కడి నుంచి అరగొండకు చేరుకుని వైఎస్సార్, రాజ్యాంగకర్త అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి ప్రజలు ఆయనకు తలపాగా చుట్టి, నాగలిని బహూకరించారు.
తరువాత దిగువమాఘం, పల్లె చెరువు, మత్యం క్రాస్‌ల మీదుగా ఐరాల, పట్నం గ్రామంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, సమన్వయకర్తలు ఆదిమూలం, సునీల్‌కుమార్, రాజంపేట పార్లమెంటరీ పరిశీలకుడు మిథున్‌రెడ్డి, యువజన విభాగం కన్వీనర్ ఉదయకుమార్, పార్టీ నాయకులు బాబ్‌జాన్, బీరేంద్ర, వై.సురేష్ పాల్గొన్నారు.