ఓఎన్జీసీ హెలికాఫ్టర్‌కు తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

ఓఎన్జీసీ హెలికాఫ్టర్‌కు తప్పిన ప్రమాదం

Published Thu, May 3 2018 12:55 PM

ONGC chopper narrow escapes from accident - Sakshi

సాక్షి, రాజమండ్రి: రాజమండ్రిలో ఓఎన్జీసీ హెలికాఫ్టర్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం ఓఎన్జీసీకి చెందిన హెలికాఫ్టర్‌ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కావాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణంతో ల్యాండింగ్‌ కష్టమై ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. అయితే స్థానికంగా ఉన్న రావులపాలెం వద్ద పొలాల్లో హెలికాఫ్టర్‌ను ఫైలట్‌ సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో హెలికాఫ్టర్‌లో ఉన్న సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

కాగా, ఈరోజు ఉదయం నుంచి రాజమండ్రిలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో పలు చోట్టు చెట్లు, భారీ హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. మరోవైపు ఆకాశం మేఘావృతం కావడంతో పట్టపగలే చిమ్మచీకటిని తలపిస్తోంది. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement