వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం లక్ష్మీగారిపల్లె సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం లక్ష్మీగారిపల్లె సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కడప-తిరుపతి రహదారిలో కారును లారీ ఢీకొంది. కారులో ఉన్న ఎరువుల వ్యాపారి హరినారాయణ (47)తోపాటు వెంకట్రామరాజులకు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం రైల్వే కోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హరినారాయణ మృతి చెందాడు.