ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్సీ గేయానంద్ విమర్శించారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్సీ గేయానంద్ విమర్శించారు. గురువారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును గేయానంద్ ఎండగట్టారు. రాయలసీమపై మొసలి కన్నీరు కారుస్తన్న చంద్రబాబుకు హంద్రీనీవా ప్రాజెక్టు కనిపించలేదా అని ప్రశ్నించారు.
హంద్రీనీవా ప్రాజెక్లు పూర్తి కావాలంటే రూ.2500 కోట్లు అవసరమైతే.. ప్రభుత్వం కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించిందని ఆరోపించారు. ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు నూతన రాజధానిపై చూపిస్తున్న శ్రద్ధ.. కరువు రైతులపై ఎందుకు చూపలేదో సమాధానం చెప్పాలని గేయానంద్ డిమాండ్ చేశారు.